మందుబాబులకు శుభవార్త.. ఇక రాత్రి 11 వరకు..  - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులకు శుభవార్త.. ఇక రాత్రి 11 వరకు.. 

August 3, 2020

Good news for drinkers .. Loquer shops open till 11 pm...

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మందుబాబులకు వచ్చినన్ని తిప్పలు అన్నీఇన్నీ కావు. కరోనా ఓవైపు వారి కరువు ఓవైపు ఎలా ఉండేవో తెలిసిందే. ఈ క్రమంలో వారి మీద ఆబ్కారీ శాఖ కనికరం చూపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఉండగా.. దానిని ఇప్పుడు సడలించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరపవచ్చు. ఈ మేరకు మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

లాక్‌డౌన్‌ నిబంధనల రాష్ట్రంలో మే 6 నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం.. మద్యం అమ్మకాల వేళల్లో రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేస్తూ జూన్‌ 1న ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆబ్కారీ శాఖ మరోసారి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9:30 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతిచ్చింది. కాగా, ఇకపై పాత పద్ధతిలో మద్యం అమ్మకాలు జరగనున్నాయి.