డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందా.. నో ప్రాబ్లమ్..  - MicTv.in - Telugu News
mictv telugu

డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందా.. నో ప్రాబ్లమ్.. 

March 31, 2020

Good News for Driving Licence Holders  

డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన వారికి కేంద్ర రవాణా శాఖ ఊరట కల్పించింది. లాక్‌డౌన్ ఉన్న కారణంగా రెన్యూవల్ చేసుకోలేని వారికి గడువు పొడిగించింది. 2020 జూన్ 30 వరకు కాలపరిమితిని పెంచినట్టుగా వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 మధ్య కాలంలో ఎవరికైతే లైసెన్స్ కాల పరిమితి ముగుస్తుందో వారు జూన్ 30 తర్వాత రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. అప్పటి వరకూ ప్రస్తుతం గడువు ముగిసినా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగడం లేదు. ప్రజలు కూడా ఎక్కువగా వస్తే వైరస్ విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సుతో పాటు వెహికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కూడా ఈ గడువు లోపు రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మరోవైపు ఇప్పటికే  కమర్షియల్ వాహనాలైన ట్యాక్సీ, బస్సులు ట్యాక్స్ లయబిలిటీని కూడా రద్దు చేసింది. దీంతో 23 కోట్ల మంది వాహన యజమానులు, 1.2 కోట్ల వాహనాలకు భారీ ఊరట లభించినట్టయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా రవాణాశాఖ నియమాలను అన్ని రాష్ట్రాలు పాటించాలని కేంద్రం కోరింది.