Good news for engineering graduates..crore jobs..
mictv telugu

ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు శుభవార్త..కోటీ ఉద్యోగాలు..

August 2, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేసుకొని, సాఫ్ట్‌వేర్, ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్లకు అలాగే ఐటీ నిపుణులకు టీమ్‌ లీజ్‌ నివేదిక ఓ శుభవార్తను చెప్పింది. ఐటీ, బీపీఎం (బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌) రంగాల్లో అతి త్వరలోనే భారీ ఉద్యోగాలు రానున్నాయని, మూడు లక్షలకుపైగా ఉద్యోగాల కల్పనతో దేశీయ ఐటీ, బీపీఎం  2023కల్లా 7 శాతం వృద్ది నమోదుకానుందని సోమవారం “డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్”లో తెలిపింది. అంతేకాదు, భారతదేశంలో అతికొద్ది సంవత్సరాల్లోనే 5 మిలియన్ల నుండి 10 మిలియన్లకు (అంటే కోటి ఉద్యోగాలు) పెరగనున్నాయని పేర్కొంది.

టీమ్‌ లీజ్‌ నివేదిక వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..”2022 చివరి నాటికి డిజిటల్ నైపుణ్యాల డిమాండ్ 8.4 శాతం పుంజుకోనుంది. హెడ్‌కౌంట్ 5.1 మిలియన్ల నుంచి 5.45 మిలియన్లకు పెరుగుతుంది. ఈ ఇండస్ట్రీలో అట్రిషన్ తదుపరి త్రైమాసికాల్లో కూడా అత్యధికంగానే ఉంటుంది. 2023లో కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు కనీసం 49 శాతం నుండి 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అయితే, లిం​గ సమానత్వం మెరుగుపడుతోంది. ప్రస్తుతం 20 శాతం నుంచి 2023 ఆర్థిక సంవత్సరానికి 25 శాతానికి పెరగబోతోంది” అని తెలిపింది.

మరోపక్క వర్క్‌ఫ్రం హోం విధానం, డిజిటల్ నైపుణ్యాలున్న వారు మెట్రోయేతర నగరాల్లో లభిస్తున్న తరుణంలో కంపెనీలే ఉద్యోగాలను వారి వద్దకే తీసుకువెళుతున్నాయని టీమ్‌ లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ వెల్లడించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఊపందుకున్నప్పటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 33 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని, ఇందులో 35 శాతం గ్రాడ్యుయేట్లు టాప్ 500 నగరాల నుంచే వస్తున్నారని టీమ్‌ లీజ్‌ నివేదికలో వెల్లడి అయ్యింది అని ఆయన పేర్కొన్నారు.