జియో కస్టమర్లకు శుభవార్త.. ఆరు కొత్త ప్లాన్లకు ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

జియో కస్టమర్లకు శుభవార్త.. ఆరు కొత్త ప్లాన్లకు ప్రకటన

April 20, 2022

7

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘జియో ఫైబర్’కు సంబంధించి ఆరు కొత్త ప్లాన్లను ప్రకటించామని పేర్కొంది. ప్రకటించిన ఈ కొత్త ప్లాన్లలో ఏది ఎంపిక చేసుకున్నా.. ఉచితంగా సెట్ టాప్ బాక్స్, ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వేట్ రూటర్)తోపాటు, ఇన్‌స్టాలేషన్ కూడా ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించింది.

ఇక, ధరల విషయానికొస్తే.. రూ.399 నుంచి రూ.3,999 మధ్య వీటి ధరలు ఉన్నాయి. ఈనెల 22 నుంచి ఈ కొత్త ప్లాన్లు అందుబాటులో ఉంటాయని రిలయన్స్ సంస్థ తెలిపింది. నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయానికొస్తే.. రూ.399, రూ.699, రూ.999, రూ.1,499, రూ.2,499, రూ.3,999గా ఉన్నాయి. వీటిలో ఏ ప్లాన్ తీసుకున్నా, ప్రతి నెలా రూ.100-200 అదనంగా చెల్లిస్తే 14 ఓటీటీ యాప్‌లను యాక్సెస్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. వీటిల్లో డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్, సన్ నెక్స్ట్, డిస్కవరీ ప్లస్, ఇరోస్ నౌ, జియో సినిమా, లయన్స్ గేట్ ఉన్నట్లు వెల్లడించింది.

ఇందులో ”రూ.399 ప్లాన్ వోచర్‌లో.. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను 30ఎంబీసీఎస్ వేగంతో పొందొచ్చు. ఈ ప్లాన్‌తోపాటు, ప్రకటించిన అన్ని కొత్త ప్లాన్లలో ప్రతి నెలా మరో రూ.100 చెల్లిస్తే, 6 ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. రూ.200 చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్‌ను వీక్షించొచ్చు” అని రిలయన్స్ సంస్థ సూచించింది.