దేశీయ టెలికాం సంస్థ ‘రిలయన్స్’ జియో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అదిరిపోయే బంపరాఫర్‌ను యూజర్లకు ప్రకటించింది. గతేడాది నవంబర్‌లో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు బెన్ఫిట్స్ తగ్గించి టారిఫ్ ధరల్ని భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు డబుల్ అయ్యాయి. యూజర్లు తమకు లాభదాయకంగా ఉన్న టెలికాం కంపెనీల వైపు మొగ్గు చూపారు. దీంతో ఆయా కంపెనీల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకునేందుకు జియో బంపరాఫర్ ప్రకటించింది. రూ.200ల లోపు ఉన్న టారిఫ్ ప్లాన్లకు ప్రతి రోజు 1జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా ఈఏడాది చివరి నాటికి దేశంలో వెయ్యి నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 4జీ టారిఫ్ ధరల్ని పెంచి 5జీపై పెట్టుబడులు పెట్టింది. ఈ నేపథ్యంలో జియో యూజర్లకు తక్కువ ధరలో అదిరిపోయే ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
ప్రత్యేకంగా జియో యుజర్లకు
1. రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్‌కు ప్రతిరోజు 1జీబీ డేటా,
అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్,
ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు,
20 రోజుల వ్యాలిడిటీ,
జియో మూవీస్, జియో క్లౌడ్ సేవలు
2. రూ.179ప్లాన్‌తో..
24 రోజుల వ్యాలిడిటీ,
ప్రతిరోజూ 1జీబీ డేటా,
100ఎస్ఎంఎస్లు,
అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్,
వ్యాలిడిటీని పెంచుకోవాలంటే రూ.149 రిఛార్జ్.
3. రూ.209తో రీఛార్జ్ చేసుకుంటే..
28రోజుల వ్యాలిడిటీ,
ప్రతిరోజు 100ఎస్ఎంఎస్లు,
అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్,
జియో మువీస్, జియో క్లౌడ్‌తో పాటు మరిన్ని సేవలు.
4. ఇక 28రోజుల వ్యాలిడిటీతో వొడాఫోన్ ఐడియా రూ.269 వసూలు చేస్తుంది. బేసిక్ లెవల్స్‌లో బెన్ఫిట్స్ ఉన్నాయి.
5. రూ.119చెల్లిస్తే..
ప్రతిరోజు 1.5జీబీ డేటా,
అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్,
300 ఎస్ఎంఎస్లు,
వ్యాలిడిటీ 14రోజులు.
6. రూ.199కి..
23రోజుల వ్యాలిడిటీ,
ప్రతిరోజు 1.5జీబీ డేటా,
100ఎస్ఎంఎస్లు,
అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్ మాట్లాడొచ్చు అని తెలిపింది.