దేశవ్యాప్తంగా పెళ్లిల సందడి మొదలైంది. దీంతో వరుడికి, వధువుకు కావాల్సిన బంగారం, వెండి అభరణాలపై పెద్దలు జ్యూవలరీల బాటపడుతున్నారు. ఇటువంటి సమయంలో వ్యాపార సంస్థలు బంగారం, వెండి కొనాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్తను చెప్పాయి. బంగారం, వెండి ధరలను తగ్గిస్తూ, నిర్ణయం తీసుకున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 ఉన్న ధర 700 తగ్గి 49,150కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 54,380గా ఉండి 760కి తగ్గి 53,620కి చేరింది.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 700 తగ్గి రూ. 49,150 చేరింది. 24 కేరట్ల బంగారం రూ. 760 తగ్గి రూ. 53,620 వద్ద నిలిచింది. కిలో వెండి ధర 1,400 తగ్గి రూ. 73,500 పలుకుతోంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ రూపాయి విలువను హరించేస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్ 129 డాలర్లకు చేరుకోవడంతో అది ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిళ్లకు దారితీసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాలంలో అత్యంత కనిష్ఠానికి చేరింది.