గోపీచంద్ అభిమానులకు గుడ్ న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

గోపీచంద్ అభిమానులకు గుడ్ న్యూస్

December 22, 2021

13

హీరో గోపీచంద్ తెలుగు చిత్రసీమ పరిశ్రమలో విభిన్న కథలతో, సాహసంతో కూడిన పాత్రలు చేస్తూ, ప్రక్షకుల మన్నలు పొందుతున్నాడు. తన సినిమా కేరీర్ ప్రారంభమైనప్పటి నుంచి నేటికి 29 సినిమాలు పూర్తి చేశారు. తాజాగా తన 30వ సినిమాకు సంబంధించిన విషయాలను చిత్ర బృందం వెల్లడించింది. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్.. తన 30వ సినిమా కోసం భారీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకు పూర్వం లక్ష్యం, లౌక్యం వంటి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు శ్రీవాస్‌తో కలిసి 30వ సినిమా చేయబోతున్నాడు.

ఈ ఇద్దరీ కాంబినేషనల్లో వచ్చిన రెండు సినిమాలు భారీ హిట్ కొట్టగా, మూడవ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 24 నుంచి షూటింగు హైద్రాబాదులో ప్రారంభం కానుందని, ఈ సినిమాకు విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్శించనున్న ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా పక్క కమర్షియల్ అని చిత్ర బృందం వెల్లడించింది.