తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ మరో గుడ్న్యూస్ చెప్పింది. గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సమయంలో అభ్యర్థుల ఆప్లికేషన్లో ఏమైనా తప్పులు దొర్లినా, పేరు, జెండర్, పట్టిన తేదీ, విద్యార్హతలు, ఫోటో, సంతకం వంటి వివరాలను ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచామని అధికారులు సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటించిన ప్రకటన ప్రకారం.. ”ఆన్లైన్లో గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తులు చేసిన సమయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాం. ఈ అవకాశం ఈ నెల 19 నుంచి 21వ తేదీలోపు గ్రూప్-1 అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా తమ పేరు, జెండర్, పట్టిన తేదీ, విద్యార్హతలు, ఫోటో, సంతకం వంటి వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. కావున తమ ఆప్లికేషన్లో తప్పులు దొర్లిన అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి” అని అధికారులు పేర్కొన్నారు.