ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త తెలిపింది. మెట్రో ప్రయాణికులను ప్రోత్సహించడానికి ఛార్జీల్లో రాయితీలు ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ కల్పించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ రాయితీలు రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు వర్తిస్తాయి. స్మార్ట్‌కార్డు, ట్రిప్కార్డుల ద్వారా 40 నుంచి 50 శాతం వరకు ప్రత్యేక రాయితీ లభించనుంది.
ట్రిప్ కార్డులపై రాయితీ రేపట్నుంచి సంక్రాంతి వరకు వర్తించనుంది. ఇటీవల కురిసిన వర్షాల గురించి ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ..’వరదల వల్ల నగరంలో రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రోడ్ల మీద ప్రయాణం కష్టంగా మారింది. అందుకే మెట్రో ప్రయాణాలను ప్రోత్సహించాలని రాయితీలు ప్రకటించాం. వరద వచ్చిన రోజున ఒక గర్భిణీ కోసం ప్రత్యేకంగా ఒక మెట్రో రైలును నడిపాం.’ అని తెలిపారు.