Good news for Hyderabadis.. Metro services till Shamshabad
mictv telugu

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. శంషాబాద్ వరకు మెట్రో సేవలు

November 27, 2022

 

హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించనున్నారు. మైండ్‌ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోను పొడిగించనున్నారు. ఈ మార్గంలో నిర్మాణ పనులకు డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 31 కిలోమీట‌ర్ల చేప‌ట్టే ఈ ప‌నుల‌ను రూ. 6,250 కోట్ల వ్య‌యంతో చేప‌ట్ట‌నున్నారు. డిసెంబ‌ర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ ఈ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

 

హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి ఈ నెల 14న  కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ కింద నిర్మించ తలపెట్టిన బీహెచ్ఈఎల్- లక్డీకపూల్, నాగోల్- ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని లేఖలో తెలిపారు. ఇందుకోసం రూ.8,453 కోట్లు ఖర్చవుతుందని.. దీని నిమిత్తం 2023- 24 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. సెకండ్ ఫేజ్‌లో 31 కి.మీల మేర మెట్రోను నిర్మించనున్నారు. ఇందులో బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కి.మీ మేర మార్గం వుంటుందని.. ఇందులో 23 స్టేషన్లు వుంటాయన్నారు.. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు నిర్మించే మార్గంలో 4 మెట్రో స్టేషన్లు వుంటాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్.

 

ఇదికూడా చదవండి : మన్‌కీ బాత్‌లో తెలంగాణ ప్రస్తావన.. సిరిసిల్ల నేతన్నపై ప్రశంసలు