హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సులో ఫ్రీ జర్నీ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సులో ఫ్రీ జర్నీ

March 2, 2022

ulihki

ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్టణం, కాకినాడ, భద్రాచలం, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి రెండు గంటలపాటు సిటీ బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నుంచి 250 కిలోమీటర్ల దూరం మించి ఉన్న ప్రాంతాలకు ఆన్‌లైన్‌ లేదా బుకింగ్‌ కేంద్రాల వద్ద రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశం పొందవచ్చు. బుక్‌ చేసుకున్న బస్సు బయలుదేరే టైం వరకు, రెండు గంటల ముందు నగరంలో ఏ ప్రాంతం నుంచైనా బస్సు ఉన్న చోటుకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. నాన్‌ ఏసీ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు.. నాన్‌ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్‌ల్లోనూ, నాన్‌ ఏసీ బస్సుల్లోను ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాలకు వచ్చే ప్రయాణికులకు కూడా వారు షెడ్యూల్డ్‌ టైం నుంచి 2 గంటలలోపు మీ గమ్యస్థానాలకు చేరుకునే వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు” అని సత్యనారాయణ పేర్కొన్నారు. కావున టీఎస్‌ ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.