Good news for Insta users..No more large size videos
mictv telugu

యూజర్లకు ఇన్‌స్టా శుభవార్త..ఇకపై పెద్ద సైజు వీడియోలు

September 26, 2022

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సామాజిక మాధ్యమల ట్రెంట్ నడుస్తోంది. కొత్త కొత్త ఆలోచనలతో యువత సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్‌ను వీడియోలో రూపంలో బహిర్గతం చేసుకుంటున్నారు. ఆ వీడియోలను వీక్షిస్తున్న నెటిజన్స్..లైక్‌లు, షేర్లు, కామెంట్లు చేస్తూ, వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దాంతో కొంతమంది రాత్రికి రాత్రే యూట్యూబ్ స్టార్లుగా, ఇన్‌స్టా స్టార్లుగా మారుతున్నారు.

అయితే, ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఇన్ స్టా గ్రామ్’ తన యూజర్లకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.”ప్రస్తుతం ఇన్‌స్టా‌గ్రామ్ స్టోరీస్‌లో పెద్ద సైజు వీడియోలను పోస్ట్ చేసే అవకాశం లేదు. పోస్ట్ చేస్తే, దాన్ని 15 సెకన్ల నిడివిగల చిన్నపాటి వీడియో క్లిప్‌లుగా సాఫ్ట్‌వేర్ విడగొడుతోంది. ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. 60 సెకన్లు, అంటే ఒక నిమిషం వరకు నిడివి ఉన్న వీడియో ఒక్కటిగానే పోస్ట్ అవుతుంది. చిన్న చిన్న క్లిప్‌లుగా విడిపోవడం ఉండదు” అని తెలియజేసింది.

ఇక, ఇన్ స్టా విషయానికొస్తే..టిక్‌టాక్‌కు గట్టి పోటీ నిచ్చేందుకు ఇన్ స్టా గ్రామ్ కూడా ఈ ఫీచర్‌ను మార్చినట్టు తెలుస్తోంది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్‌లో ఎక్కువగా వీడియోలను పోస్ట్ చేసే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది. త్వరలోనే అప్ డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందన్నది తాజా సమాచారం.