భారతదేశంలో టిక్‌టాక్ యాప్ ద్వారా కొంతమంది యువతి, యువకులు తమ డ్యాన్స్‌లతో, డైలాగులతో, హావభావలతో రాత్రికి రాత్రే స్టార్ల్ అయ్యారు. దాంతో రోజుకు రెండు నుంచి మూడు వీడియోలు చేస్తూ, వాటిని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసుకునే వారు. ఆ వీడియోలకు లైక్‌లు, కామెంట్స్, షేర్లు రావటం చూసి తెగ ఆనందపడేవారు. ఈ క్రమంలో టిక్‌టాక్ యాప్‌పై దేశవ్యాప్తంగా ప్రజలు, తల్లిదండ్రులు, నిపుణులు తీవ్రమైన విమర్శలు చేస్తూ, టిక్‌టాక్ యాప్‌ను వెంటనే నిలిపివేయాలని, యువత పూర్తిగా చెడుపోతున్నారని, వందల కొద్ది యువకులు ప్రేమ పేరుతో చనిపోతున్నారని కోర్టులను ఆశ్రయించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు టిక్‌టాక్‌ను పూర్తిగా మూసివేస్తూ, ఆదేశాలు ఇచ్చాయి.
ఈ క్రమంలో టిక్‌టాక్ యాప్ వల్ల స్టార్లు అయిన యువత తీవ్ర మనోవేదన చెంది, అతలకూతలం అయ్యింది. అటువంటి సమయంలో దేశియా సంస్థలు తయారు చేసిన ఇన్స్టాగ్రామ్, షేర్‌చాట్ వంటి యాప్‌లు అందుబాటులోకి రావడంతో యువత మళ్లీ ఊపిరి పీల్చుకుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం వినియోగదారులకు ఓ శుభవార్తను చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియజేసింది.
”ఈ కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టా ఐజీలో ప్రవేశపెట్టనున్నాం. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ సమీపంలో ఉన్న స్థానిక వ్యాపారాలు, ప్రముఖ స్థలాలను కనుగోనవచ్చు. అంతేకాదు, ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించిన సమయంలో సదరు లొకేషన్‌కు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, పాలు, సందర్శనీయ ప్రాంతాలు ఇలా అన్నింటి వివరాలను ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. గత ఏడాది నుంచి ఈ ఫీచర్‌పై టెస్టింగ్ జరుగుతుంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తాం” అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు.