దసరా నవరాత్రుల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్కు తీపితీపి కబురు అందింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టు ఈ రోజు కొట్టేసింది. వీటికి విచారణ అర్హత లేదని, పిటిషన్లు సరైన వాదనలు వినిపించలేకపోయారని కోర్టు పేర్కొంది.రాష్ట్రంలో బోగస్ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, ముందస్తు ఎన్నికల వల్ల కొత్త ఓటర్లు ఓటు కోల్పోతారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి, శశాంక్ రెడ్డి తదితరులు వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు ఆదేశంలో హైకోర్టు విచారించింది. అసెంబ్లీ రద్దయింది కనుక రాజ్యాంగ నిబంధనల ప్రకారం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని, ఈ పిటిషన్లపై హైకోర్టు త్వరగా విచారణ ముగించాలని సుప్రీం కోరింది. తెలంగాణలో 68 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.