కేసీఆర్‌కు ఎన్నికల సంఘం శుభవార్త.. అందుకు ఓకే - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు ఎన్నికల సంఘం శుభవార్త.. అందుకు ఓకే

October 5, 2018

అసెంబ్లీ ఎన్నికల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. కొన్ని షరతులతో రైతు బంధు పథకం చెక్కులను పంచుకోవడానికి అనుమతిచ్చింది. గతంలో నమోదైన రైతన్నలకే వీటిని పంపిణీ చేయాలని, పథకంలో కొత్తగా ఎవరినీ చేర్చకూడదని, నగదు పంచకూడదని స్పష్టం చేసింది.

er

పంపిణీలో రాజకీయ నాయకులు జోక్యం వద్దని పేర్కొంది.మొదటిసారి రైతుబంధు చెక్ అందుకున్న రైతులకు మాత్రమే రెండో దఫా చెక్కుల పంపిణీని బ్యాంకు ఖాతాలో జమ చేయాలంది. వ్యవసాయ అధికారుల ద్వారా నేరుగా రైతులకు పంపిణీ చేయవద్దని హెచ్చరించింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రభావం చూపే అవకాశముందని విపక్షాలు  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసిదే. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ఎకరాకు రూ.4వేలు చొప్పున సంవత్సరానికి రూ.8 వేలు ఇస్తున్న విషయం విదితమే. తొలి సీజన్లో రూ.4వేలు ఇవ్వగా  రెండోదఫా రూ.4వేలు రానుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక బతుకమ్మ పండగ కోసం చీరలు పంచకూడదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే.