టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఓ శుభవార్తను చెప్పింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి మరో కొత్త చిత్రం రాబోతుందని, ఆ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు శనివారం సోషల్ మీడియాలో ఓ ట్విట్‌ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు తమన్ సైతం ఈ కొత్త సినిమాపై “తెల్లవారుజాము నుంచే మహేశ్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ ప్రారంభించా” అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో మహేశ్ బాబు తెగ ఆనందపడుతున్నారు.
మరోపక్క మహేశ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలను తీశారు. అందులో ‘అతడు’ సినిమా మహేశ్ కెరీర్లో గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో సినిమాకు సిద్దమైయ్యారు.