Good news for meat lovers..no more Sarkari Kotlu
mictv telugu

మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్..ఇకపై సర్కారీ కొట్లు

October 3, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం వచ్చిదంటే చాలు ఆయా జిల్లాల్లో, మండల్లాల్లో, గ్రామాల్లో మేక, గొర్రెల, చికెన్‌, చేపలు తదితర మాంసాలకు భారీ డిమాండ్ ఉంటుంది. కొట్ల దగ్గర జనాలు తండోపతండాలుగా మాంసం కోసం ఎగబడుతుంటారు. అదే అదునుగా చేసుకొని, వ్యాపారులు ఇష్టారాజ్యంగా కిలో మాంసం ధర రూ. 500 నుంచి రూ. 800పైగానే విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో సామాన్య ప్రజలు ఆ మటన్ ధరలను చూసి, కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఓ శుభవార్తను చెప్పారు.

”రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నాణ్యమైన మాంసాన్ని అందుబాటు ధరల్లో విక్రయించేందుకు సర్కారీ దుకణాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సర్కారీ కొట్ల ద్వారా ప్రజలకు గొర్రెల మాంసం, మేకల మాంసం, చేపలు, చికెన్‌ను అందించనుంది. తొలుత హైదరాబాద్లోని మసాబ్‌ట్యాంకులో మత్స్యశాఖ చేపల దుకాణం పక్కనే, మాంసం విక్రయాలను ప్రారంభించనున్నాం. తర్వాత రాష్ట్రమంతటా రైతు బజార్లలో దుకాణాలను ఏర్పాటు చేస్తాం. ఇకపై మేకలు, గొర్రెల పెంపకందారుల సంఘాల ఆధ్వర్యంలోనే దుకాణాలు ఏర్పాటు చేస్తే, ప్రజలకు నాణ్యమైన మాంసం లభిస్తుంది. చిల్లర ధర కూడా అందుబాటులో ఉండేలా నిర్ణయిస్తాం” అని ఆయన తెలిపారు.

మరోపక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలు, వంటనూనెల ధరలను సామాన్య ప్రజలు కొనుగోలు చేసే విధంగా ధరలను నిర్ణయిస్తూ, ముందుకెళ్తోంది. ఇప్పుడు మాంసం విషయంలో కూడా చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ప్రజల నుంచి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ధరలకు చెక్ పేట్టేందుకు రెడీ అయ్యింది. ఈ మాంసం దుకణాలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తే, కిలో మాంసం ధర సామాన్యులు కొనుగోలు చేసే స్థాయిలోనే ధరలు ఉంటాయని ఛైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తెలిజేశారు.