మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇకనుంచి - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇకనుంచి

April 27, 2022

Good news for metro commuters .. from now on

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న మెట్రో యాజమాన్యం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని, కొత్త కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవలే మెట్రో దిగగానే, ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా మెట్రోరైడ్ ఎలక్ట్రికల్ ఆటోలను ప్రవేశపెట్టింది.

ఇప్పుడు మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఉచితంగా సినిమాలను చూసేలా హైస్పీడ్ ఇంటర్ నెట్‌ సౌకార్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సినిమాలతోపాటు ఎంటర్టైన్‌మెంట్, షాపింగ్, ఇలా నచ్చినవి ఫ్రీగా డౌన్లోడు చేసుకోవచ్చని పేర్కొంది.

అయితే, 2019లోనే మెట్రోతో అనుసంధానం చేసుకున్న షుగర్ బాక్స్ సంస్థ తన డిజిటల్ హైస్పీడ్ కనెక్టివిటీ సేవలను అమీర్‌పేటలోని మెట్రో స్టేషన్లో మంగళవారం ప్రవేశపెట్టింది. ఇందుకుగాను పేటెంటెడ్ క్లౌడ్ ఫ్రాగ్మెంట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.