మొబైల్ ప్రియులకు శుభవార్త.. రూ.5,999కే స్మార్ట్ ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

మొబైల్ ప్రియులకు శుభవార్త.. రూ.5,999కే స్మార్ట్ ఫోన్

June 2, 2022


మొబైల్ ప్రియులకు ‘Mara M3’ స్మార్ట్ ఫోన్ సంస్థ శుభవార్త చెప్పింది. తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి తమ కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్‌లో రూ.5,999కే అందిస్తున్నట్లు తెలిపింది.

ఇక, ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. కంపెనీ పేరు ‘Mara M3′.ఈ స్మార్ట్ ఫోన్‌‌.. 6.088 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, 5000mAhభారీ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మెమొరీ కార్డు సహాయంతో 256 జీబీ వరకు పెంచుకోనేలా ఫీచర్లు కల్గి ఉందని సంస్థ తెలిపింది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇంకా..’డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రైమరీ లెన్స్ 13 మెగా పిక్సెల్ క్వాలిటీ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సల్ కెమెరా సెటప్ ఉంటుంది. నైట్ మోడ్, బ్యూటీ మోడ్, స్లో మోషన్, టైమ్ లాప్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. కానీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు’. ఈ స్మార్ట్ ఫోన్ నిర్ఱీత ధర రూ.7,999. ఈ ఫోను ఫ్లిప్ కార్ట్ సేల్‌లో రూ.5,999కే కొన్ని రోజులు పరిమిత ఆఫర్ కింద అందిస్తున్నామని, కొటక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని ‘Mara M3’ వివరించింది.