భారతీయ రైల్వేశాఖకు చెందిన ఉత్తరాది రైల్వే జోన్ చిన్న పిల్లలతో ప్రయాణం చేసే తల్లులకు శుభవార్త చెప్పింది. ఉత్తరాది రైల్వే జోన్ పరిధిలోని లక్నో డివిజన్ ‘బేబీ బెర్త్ పేరుతో’ రైళ్లలో ‘ఎక్సట్రా స్మాల్ బెర్త్’ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బెర్త్ కేవలం చిన్న పిల్లల కోసమే రూపొందించబడిందని, లోయర్ బెర్త్‌కు అనుబంధంగా పక్కనే ఉండేలా ఈ ‘బేబీ బెర్త్’ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇకనుంచి రైలులో ప్రయాణించే తల్లులు తమ బేబీ విషయంలో ఏలాంటి ఇబ్బందులు పడకుండా ‘మీ బేబీ కోసం బెర్త్’ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Traveling alone !
Don’t be afraid, because ‘Meri Saheli’ (RPF) team is always there for you.
Meri Saheli team of Northern Railway is ever attentive for the safety of women traveling alone in trains.#Meri_Saheli pic.twitter.com/UFBJzUv01W
— Northern Railway (@RailwayNorthern) May 10, 2022
”మదర్స్ డే సందర్భంగా లక్నో మెయిల్లో కోచ్ నెంబర్ 194129/ బీ4, బెర్త్ నెం 12&60ను ‘బేబీ బెర్త్’తో కలిపి రూపొందించాం. తమ బిడ్డతో కలిసి ప్రయాణం చేసే తల్లుల కోసం ఈ బేబీ బెర్త్‌ను తీసుకొచ్చాం” అని ఉత్తరాది రైల్వే జోన్ జనరల్ మేనేజర్ తెలిపారు. దీంతో ఈ సరికొత్త ఆలోచనపై నెటిజన్ల సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఉత్తరాది రైల్వే జోన్‌పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఇది ఒక మంచి నిర్ణయం అంటూ, ఇండియాలోని అన్ని రైల్వేశాఖలు ఈ నిర్ణయం తీసుకోవాలని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ బేబీ బెర్త్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో టికెట్ బుక్ ఎలా చేసుకోవాలి అనే వివరాలను త్వరలోనే రైల్వేశాఖ వెల్లడించనుంది.