Good news for motorists.. Digital driving license in 'Parivahan Seva'
mictv telugu

వాహనదారులకు శుభవార్త.. ‘పరివాహన్ సేవా’లో డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌

July 19, 2022

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీ విషయంలో వాహనదారుల ఇబ్బందులను గుర్తించి, ఇక నుంచి ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఏదైనా సందర్భంలో రోడ్డుపై వెళ్తున్నప్పుడు పోలీసులు వాహనాన్ని ఆపి, డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే వెంటనే మొబైల్ ఫోన్‌లోనే అక్కడికక్కడే డౌన్‌లోడ్ చేసి లైసెన్స్‌ను చూపించేలా వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసింది.

ఆ వెబ్‌సైట్ పేరు ”పరివాహన్ సేవా (https://parivahan.gov.in/). ముందుగా ఆన్‌లైన్ సర్వీసెస్ సెక్షన్‌లో ‘డ్రైవర్స్ లైసెన్స్ రిలైటెడ్ సర్వీసెస్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. రాష్టాన్ని ఎంపిక చేసుకోవాలి. డ్రైవింగ్ లైనెస్స్ సెక్షన్‌లో ‘ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్’ను ఎంపిక చేసుకోవాలి. దరఖాస్తును పూర్తి చేయాలి. దీన్ని ప్రింట్ తీసుకోవడం లేదంటే పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో సేవ్ చేసుకోవాలి.

ఇంకా, డీజీలాకర్ పోర్టల్‌పై (https://digilocker.gov.in/) లాగిన్ అవ్వాలి. ‘సెర్చ్ డాక్యుమెంట్స్’ను క్లిక్ చేయాలి. పేజీపై భాగంలో ఎడమ చేతివైపు ఇది ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ‘మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్’ పై ట్యాప్ చేయాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ నమోదు చేసి, ‘గెట్ ద డాక్యుమెంట్’ పై క్లిక్ చేయాలి. డ్రైవర్స్ లైసెన్స్ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ పై ట్యాప్ చేయాలి.”

ఇప్పటికే ఈ సదుపాయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో RTA m-wallet అనే పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో లాగిన్ అయిన తర్వాత ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ పేరుతో ఉన్న ఆప్షన్‌పై క్లిక్ చేసి బండి రిజిస్టేషన్ నెంబర్, చెసి నెంబర్ టైప్ చేస్తే, డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఇదే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ”పరివాహన్ సేవా (https://parivahan.gov.in/) ద్వారా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను వాహనదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.