వాహనాదారులకు శుభవార్త.. రేపటి నుంచే ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

వాహనాదారులకు శుభవార్త.. రేపటి నుంచే ప్రారంభం

February 28, 2022

తెలంగాణ రాష్ట్ర పోలీసులు వాహనదారులకు తీపి కబురును అందించారు. పెండింగ్‌లో ఉన్న వాహనాల చలానాలపై రాయితీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా చలానాలు పెండింగ్‌లో ఉన్న వాహనదారులు ఆన్‌లైన్ లేదా మీ సేవలో జరిమానా మొత్తాన్ని చెల్లించవచ్చని సూచించారు. ఈ సదవకాశం కేవలం మార్చి 1 నుంచి 30వ తేదీ వరకే ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.

ఈ సందర్భంగా సోమవారం సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. “హైదరాబాద్‌తో పాటు, అన్ని జిల్లాల్లోని వాహనాలకు రాయితీ అమలు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకోవాలి. మార్చి 30 తర్వాత పెండింగ్ చలాన్లు ఉన్నవారికి ఈ రాయితీ వర్తించదు” అని అన్నారు.

మరోపక్క ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ.500 కోట్ల విలువైన 1.75లక్షల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల రోజుల్లో చలానాలు కట్టకపోతే, స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఆటోలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఉన్న ఆటోలను మాత్రమే నగరంలోకి తిరగనిస్తామని, బయట జిల్లాల ఆటోలను ఇక్కడ తిప్పితే చర్యలు తప్పవని పోలీసులు గతకొన్ని రోజులుగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.