ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త.. 50శాతం తగ్గింపు - MicTv.in - Telugu News
mictv telugu

ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త.. 50శాతం తగ్గింపు

May 3, 2022

ఎంఎంటీఎస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్యే శాఖ శుభవార్త చెప్పింది. ఛార్జీలను 50శాతం వరకు తగ్గిస్తున్నట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు. తగ్గించిన ఛార్జీలు మే 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ”హైదరాబాద్ -సికింద్రాబాద్ జంట నగరాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో సబర్బన్ ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ఛార్జీలను 50శాతం వరకు తగ్గించాం. తగ్గిన ఛార్జీలు మే 5నుంచి అమల్లోకి వస్తాయి. ఫలక్‌నుమా – సికింద్రాబాద్, హైదరాబాద్ – లింగంపల్లి – రామచంద్రాపురం మధ్య ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని కోరారు.

ఇటీవలే లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం ఎంఎంటీఎస్ పూర్తి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 11 నుంచి జంట నగరాల మధ్య 86 ఎంఎంటీస్ రైళ్లను నడపటం మొదలుపెట్టారు. రైళ్ల టైమింగ్స్‌ను కూడా ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30వరకు పొడిగించారు. ఈ క్రమంలో నేడు ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.