Good news for NCC candidates..jobs advertisement released
mictv telugu

ఎన్‌సీసీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..55 ఉద్యోగాలకు ప్రకటన

September 12, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న కాలేజీల్లో ఎన్‌సీసీలో చేరిన విద్యార్ధినీ, విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్మీలో స్పెషాల్ ఎంట్రీ కింద ప్రతి ఏడాదికి రెండుసార్లు షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి, ఖాళీగా ఉన్న 55 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేశామని అధికారులు తెలియజేశారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చని, వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తామని వివరాలను వెల్లడించారు.

అయితే, 55 ఉద్యోగాలకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అందులో 50 ఉద్యోగాలు పురుషులకి, 5 ఉద్యోగాలకు మహిళలకి కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల్లోనూ ఈ పోస్టులు (పురుషులు 5, మహిళలు 1) యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయని తెలియజేశారు.

”ఈ ఉద్యోగాలకు.. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే, వీరు ఏప్రిల్ 1, 2023లోగా డిగ్రీ పూర్తి చేయాలి. అలాగే మూడు అకడమిక్ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్లో కనీసం బి గ్రేడ్ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ అవసరం లేదు. జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1998 – జనవరి 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు సెప్టెంబరు 15 మధ్యాహ్నం 3 వరకు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్: http://www.joinindianarmy.nic.inని సంప్రదించండి” అని అధికారులు తెలియజేశారు.