Good news for NTR fans..Taarak in Oscar list
mictv telugu

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ఆస్కార్‌‌ లిస్ట్‌లో తారక్

August 14, 2022

టాలీవుడ్‌ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌లు హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా వార్త హాట్ టాఫిక్‌గా మారింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు అంటూ ఉండడు. ‘కొమురం భీముడో, కొమురం భీముడో’ అనే పాటకు పాన్‌ ఇండియా స్థాయిలో అనేక ప్రశంసలు దక్కాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. తారక్‌ పేరు ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఉన్నట్లు ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్ ‘వెరైటీ’.. ప్రిడిక్షన్‌ లిస్ట్‌ను వెల్లడించింది.

ఆ లిస్ట్‌లో ఉత్తమ నటుడి క్యాటగిరిలో ఎన్టీఆర్‌ డే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. వెరైటీ పత్రిక వెల్లడించిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, జై ఎన్టీఆర్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, వైరల్‌ అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం త్వరలోనే తెలియనుంది.