పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్

February 23, 2022

mo

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. పవన్ కల్యాణ్ కథనాయకుడిగా, రానా ప్రతినాయకుడిగా నటించిన చిత్రం ‘భీమ్లానాయక్’. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలని అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ‘ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11 వరకు’ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి థియేటర్‌లోనూ ఐదోవ ఆటను ప్రదర్శించుకోవచ్చు అని స్పష్టం చేసింది.

 

మరోపక్క ఈరోజు సాయంత్రం 6.30 గంట‌ల నుంచి హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వ‌హించ‌నున్న‌ విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్’ తర్వాత నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.