13 ఏళ్ల క్రితం విడుదలైన ఆరేంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచినా ఈ స్టోరీ చాలా మంది యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. డిఫరెంట్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో తెరముందుకు వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మగధీర వంటి పవర్ ఫుల్ మూవీ తరువాత లవర్ బాయ్‌గా చరణ్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆక్సెప్ట్ చేయలేకపోయారు. అయినప్పటికీ ఈ సినిమాలోని ప్రతి పాట సినిమా రిలీజ్ కంటే ముందే మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్ తన ట్యూన్స్‌తో మ్యాజిక్ చేశాడు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. తీరా రిలీజైన తరువాత బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.
ప్రేమ కథా చిత్రమే అయినా ప్రేక్షకులకు ఎక్కలేదు. కథ కొత్తదే కానీ, మరీ అంత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కావడంతో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ ఈ సినిమా అంటే ఇప్పటికీ తన ఫేవరేట్ లిస్టులో ఉంటుందని రామ్ చరణ్ చాలా సందర్భాల్లో తెలిపాడు. 13 ఏళ్ల క్రితం డిజాస్టర్ అయిన ఈ సినిమా మరోసారి రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటి తరానికి కనెక్ట్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్స్‌ను జనసేనా పార్టీ ఫండ్స్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అంజనా ప్రొడక్షన్స్ బ్యానెర్లో నాగబాబు నిర్మాణ సారథ్యంలో ఆరేంజ్ సినిమాకు బొమ్మిరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చరణ్‌కు జోడీగా జెనీలియా నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మూవీ ద్వారా వచ్చిన నష్టాలను పూడ్చుకోలేక సూసైడ్ వరకు వెళ్లినట్లు ఓ ఇంటరవ్యూలో నాగబాబు వెల్లడించడం సంచలనంగా మారింది. అయితే చిరంజీవి, పవన్ తనకు తోడుగా ఉన్నారని చెప్పారు. నిజానికి రామ్ బర్త్‌డే సందర్భంగా చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మగధీర సినిమాను ముందుగా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ఆ మూవీ ప్రింట్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉండటం వల్ల డ్రాప్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించిన సందర్భంగా మగధీరను విడుదల చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించిన ఊపుమీద ఉన్న చరణ్ ఫ్యాన్స్ ఆరేంజ్ను ఏ విధంగా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.