Good news for Rowdy fans..prerelease date has arrived
mictv telugu

రౌడీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ప్రీరిలీజ్ డేట్ వచ్చేసింది

August 19, 2022

తెలుగు ఇండస్ట్రీలో రౌడీ స్టార్‌గా పేరుగాంచిన విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగర్’ చిత్రంతో ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని రౌడీ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు సామాజిక మాధ్యమాల్లో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో విజయ్ ఫ్యాన్స్‌కు చిత్రబృందం గురువారం రాత్రి ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రీ రిలీజ్ వేడుక‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించింది.

‘లైగ‌ర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్ అయ్యింది. ఆగస్ట్ 20వ తేదీన గుంటూరులోని చ‌ల‌ప‌తి ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ గ్రౌండ్స్‌లో ఈ ప్రీరిలీజ్ వేడుక‌ జరుగుతుంది’ అని మేక‌ర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఇక, ఈ ‘లైగర్’ చిత్ర విషయానికొస్తే.. క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరి జగన్నాథ్ తెర‌కెక్కించాడు. ముంబైలోని ఓ చాయ్‌ వాలా ప్ర‌పంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. విజ‌య్‌కు జోడీగా అన‌న్య‌పాండే హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకొని, ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది.