Good news for smart phone lovers..Redmi is coming with a new phone
mictv telugu

స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు శుభవార్త..రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేస్తోంది

July 11, 2022

స్మార్ట్ ఫోన్ ప్రియులకు ప్రముఖ మొబైల్ సంస్థ షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ శుభవార్తను చెప్పింది. తమ కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తోందని ఓ ప్రోమోతో కూడిన వీడియోను విడుదల చేసింది. రెడ్‌మీ 50ఐ 5జీ మొబైల్‌ ఈ నెల 20వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ కానుంది. మిడ్ రేంజ్‌లో గేమింగ్‌ ఫోకస్ మొబైల్‌గా అడుగుపెట్టనుందని అందులో పేర్కొంది.

ఇక, ప్యూచర్స్ విషయాకొస్తే.. ”మొబైల్ పేరు రెడ్‌మీ 50ఐ 5జీ. 144Hzరిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ మొబైల్‌ బేస్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంటుంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.29,000 నుంచి రూ.33,000 మధ్య ఉంటుంది. స్టీల్త్ బ్లాక్, క్విక్ సిల్వర్, ఫాంటమ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ ఉంటుంది. రెడ్‌మీ కే50ఐ 5జీ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ మొబైల్‌లో 5080 బ్యాటరీ ఉండనుండగా.. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ రూ.31,999గా ఉండే అవకాశం ఉంది” అని వివరాలను వెల్లడించింది.

అయితే, ఈ రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్‌ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారు ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో లిస్ట్ ఉందని, స్టీల్త్ బ్లాక్, క్విక్ సిల్వర్, ఫాంటమ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుందని, ఈనెల 20న లాంచ్ అయిన వెంటనే 22న సేల్‌కు వస్తుందని రెడ్ మీ యాజమాన్యం తెలిపింది.