Good news for SSC candidates..even if they get 52 they are eligible
mictv telugu

గుడ్‌న్యూస్..52 మార్కులు వచ్చినా అర్హులే

August 14, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 7వ తేదీన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి తాజాగా తుది ‘కీ’ ని అధికారులు విడుదల చేశారు. విడుదల చేసిన ‘కీ’ లో ఎనిమిది తప్పులు దొర్లయని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ తప్పులకు సంబంధించి అభ్యర్థులకు అధికారులు మరో గుడ్‌న్యూస్ చెప్పారు.

‘కీ’ ప్రకారం.. ఆ ఎనిమిది ప్రశ్నలకు 8 మార్కులను అభ్యర్థులకు కలపనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. వాస్తవానికి 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 60 మార్కులు (30 శాతం) వస్తే వారిని తర్వాతి దశకు అర్హులుగా అధికారులు నిర్ణయించారు. కానీ, మొత్తం 8 ప్రశ్నలు తప్పుగా రావడంతో ప్రాథమిక పరీక్షలో 52 మార్కులు సాధించిన తర్వాతి దశకు అభ్యర్థులు అర్హులేనని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంటే అభ్యర్థులకు 52 మార్కులు వచ్చినా ప్రిలిమ్స్‌లో క్యాలిఫై అయినట్లేన్నమాట.

ఇక, ప్రిలిమ్ పరీక్ష విషయానికొస్తే..పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో రూపొందిస్తారని, ఒక భాష నుంచి ప్రశ్నలు మరో భాషలోకి తర్జుమా చేసేటప్పుడు, కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు రెండు, మూడు (ఏ,బీ,సీ,డీ ఆప్షన్లలో) సమాధాలు సరైనవిగా ఉండటం, కొన్నిసార్లు 4 ఆప్షన్లలో కూడా సమాధానం లేకపోవడం వంటి కారణాలతోనే ఇలాంటి పొరపాట్లు జరుగతాయి. అభ్యర్థులు ఎస్సై ప్రిలిమ్ పరీక్షకు సంబంధించిన బుక్ లెట్ కోడ్ ఆధారంగా www.tslprb.inలో ప్రిలిమనరీ ‘కీ’ని అందుబాటులో ఉంచాం. అభ్యర్థులు ఫలితాలను సరిచూసుకోవచ్చు”అని అధికారులు తెలిపారు.