Good news for students..Laptop for Rs.25 thousand
mictv telugu

విద్యార్థులకు శుభవార్త..రూ.25 వేలకే ల్యాప్‌టాప్

July 19, 2022

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అత్యాధునిక ప్యూచర్స్‌తో కూడిన కొత్త కొత్త కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు విద్యాసంస్థలు పూర్తిగా బంద్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, వారి విద్యకు అవసరమైన విధంగా ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుత ప్రపంచంలో కంప్యూటర్, మొబైల్ ఫోన్‌, ల్యాప్‌టాప్‌లు అనేవి విద్యార్థులకు నిత్య పరికరాలుగా మారిపోయాయి. ఇటువంటి సమయంలో విద్యార్థినీ, విద్యార్థులకు ఇన్ఫినిక్స్ ఇండియా కంపెనీ శుభవార్తను చెప్పింది.

న్ఫినిక్స్ ఇండియా కంపెనీ తయారు చేసిన ల్యాప్‌టాప్‌ను తక్కువ బడ్జెట్‌లోనే విక్రయిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా ఆ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ”ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్ 1 నియో పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేశాం. దీని ధర రూ.24,990. మంచి పనితీరుతో కూడిన అనుభవాన్ని ఇస్తుంది. ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.24 కిలోలు. 14.8 ఎంఎం మందంతో నాజూకుగా ఉంటుంది. ఇంటెల్ సెల్ రాన్ క్వాడ్ కోర్ ఎన్ఎస్ 5100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వస్తుంది.” అని ఇన్ఫినిక్స్ తెలిపింది.

అంతేకాదు, ఈ ల్యాప్‌టాప్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని, దీనిని అల్యూమినియం అల్లాయ్ ఆధారిత మెటల్ బాడీతో తయారు చేశామని పేర్కొన్నారు. ఈ ల్యాప్‌టాప్ కాస్మిక్ బ్లూ, స్టార్ ఫాల్ గ్రే రంగుల్లో లభిస్తుందని, ఈ నెల 21 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయని తెలిపింది. సిటీ, ఆర్బీఎల్, కోటక్, యాక్సిస్ బ్యాంకు కార్డులతో కొంటే తగ్గింపు లభిస్తుందని, ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాప్ టాప్ తయారు చేసినప్పటికీ, ఇతరుల అవసరాలను కూడా బాగా ఉపయోగపడుతుందని కంపెనీ అధికారులు వివరాలను వెల్లడించారు.