Good news for teachers..green signal has come
mictv telugu

ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్..గ్రీన్ సిగ్న‌ల్ వచ్చేసింది

June 20, 2022

Good news for teachers..green signal has come

తెలంగాణ‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీ (మ్యూచువ‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్‌)ల‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమ‌వారం అనుమ‌తి ఇచ్చింది. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల కింద ఉపాధ్యాయుల‌తోపాటు, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల బ‌దిలీల‌కు కాసేపటి క్రితమే ఆమోద ముద్ర వేసింది. గ్రీన్ సిగ్న‌ల్ అందిన వెంట‌నే విద్యాశాఖ‌లో ఉపాధ్యాయులకు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని స‌బితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటినుంచో పదోన్నతుల కోసం, బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఈ ప్రకటనతో ఊరట కలిగనుంది. ఈ మ్యూచువ‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్‌ కింద రాష్ట్రంలోని 2,558 మంది ఉపాధ్యాయ‌, ఉద్యోగుల‌కు ప్ర‌యోజ‌నం ల‌భించ‌నుంది. విద్యాశాఖ మంత్రి ఆదేశాల‌తో ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు ఒక‌టి, రెండు రోజుల్లోనే ఉత్త‌ర్వులు జారీ కానున్నాయి. ఇక, ఉద్యోగుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు కూడా త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు వెలువ‌డ‌నున్నాయి.

ఇటీవలే ఈ బదిలీలకు సంబంధించి పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావులు ఈ నెల చివరికల్లా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలుపెడతామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఆ మాట ప్రకారమే.. నేడు ఉద్యోగుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీ (మ్యూచువ‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్‌)ల‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. గ్రీన్ సిగ్న‌ల్ అందిన వెంట‌నే ఈ ప్రక్రియ మొదలుకానుంది.