తెలంగాణ గ్రూప్ 1, 2 అభ్యర్థులకు శుభవార్త.. గంగుల కమలాకర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ గ్రూప్ 1, 2 అభ్యర్థులకు శుభవార్త.. గంగుల కమలాకర్

April 6, 2022

fbfb

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు బుధవారం మంత్రి గంగుల కమలాకర్ శుభవార్తను చెప్పారు.ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని,  అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ ఉచిత శిక్షణ కోసం గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల్లోపు ఉన్నవారు ఈరోజు నుంచి ఈనెల 16వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 18న ఆన్లైన్లో ఎంపిక పరీక్ష నిర్వహించి, 21 నుంచి 1.25,000 మందికి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాకుండా గ్రూప్-1, గ్రూప్-2 రాసే 10 వేల మంది అభ్యర్ధులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

గ్రూప్-1 అభ్యర్ధులకు 6నెలల పాటు నెలకు రూ. 5 వేలు, గ్రూప్-2 అభ్యర్ధులకు మూడు నెలల పాటు నెలకు రూ. 2వేలు, ఎస్సై అభ్యర్ధులకు నెలకు రూ.2వేలు స్టైఫండ్ ఇచ్చేందుకు నిర్ణయించామని గంగుల కమలాకర్ ప్రకటించారు.

మరోపక్క కేసీఆర్ అసెంబ్లీలో 91 వేల ఉద్యోగాలను త్వరలోనే దశల వారీగా భర్తీ చేస్తామని చెప్పడంతో వేలకు వేలు ఖర్చుపెట్టుకొని, పలు కోచింగ్ సెంటర్లలో అభ్యర్థులు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కోచింగ్ ముగించుకొని ఇంటివద్దే ప్రిపేర్ అవుతున్నారు. ఇంకొంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు కోచింగ్ తీసుకోవాలని, ఏ కోచింగ్ సెంటర్ అయితే బాగుంటుంది అనే ఆలోచనల్లో ఉన్నారు. అటువంటి వారికి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్ చెప్పారు.

వివరాల కోసం http://mjptbcwreis.telangana.gov.in/