Good news for the devotees of Venkanna Swamy..those tickets will be released tomorrow
mictv telugu

వెంకన్న స్వామి భక్తులకు గుడ్‌న్యూస్..రేపు ఆ టికెట్లు విడుదల

August 17, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. గురువారం (రేపు) అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

”రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అదే నెలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. కాబట్టి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నిలిపివేశాం. కాబట్టి టికెట్లను బుక్ చేసుకునే సమయంలో భక్తులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి” అని అధికారులు తెలిపారు.

ఇక, రెండు సంవత్సరాల తర్వాత తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వరకు భక్తుల మధ్యే జరగనున్నాయి. దీంతో ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది తరలిరానున్నారు. ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 27న ధ్వజారోహణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అక్టోబర్ 1న గరుడవాహన సేవ, 5న చక్రస్నానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.