విజయవాడ ప్రజలకు గుడ్‌న్యూస్.. వచ్చే నెల ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడ ప్రజలకు గుడ్‌న్యూస్.. వచ్చే నెల ప్రారంభం

April 25, 2022

ఏపీలోని విజయవాడ ప్రజలకు ఎయిరిండియా విమాన సర్వీస్‌ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు నెలలుగా నిలిచిపోయిన తమ విమానాల సర్వీసును వచ్చే నెల (మే) నుంచి ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. అంతేకాకుండా మే 3 నుంచి ఈ విమాన సర్వీస్‌కు సంబంధించి, టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభమవుతుందని, ఈ విమానం ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది అని తెలిపింది.

ఎయిరిండియా తెలిపిన వివరాల ప్రకారం.. ‘గన్నవరంకు 8.35 గంటలకు చేరుకొని, మరలా 9.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుతుంది. జూన్‌ నుంచి ఈ సర్వీస్‌ను వారానికి 7 రోజులు అందుబాటులోకి రానుంది. గన్నవరం నుంచి గతంలో న్యూ ఢిల్లీ-విజయవాడ మధ్య రోజుకు మూడు విమాన సర్వీసులు ఉండేవి. కరోనా కారణంగా సాయంత్రం వెళ్లే విమానం రద్దైంది. కొద్దిరోజుల తర్వాత పరిస్థితులు మారడంతో రాత్రి సర్వీస్‌ మొదలై, ప్రస్తుతం నడుస్తోంది.

కానీ, రెండు నెలల క్రితం సాంకేతిక కారణాలతో ఉదయం సమయంలో ఢిల్లీకి నడిచే సర్వీస్‌ నిలిచిపోయింది. సాయంత్రం వేళలో ఒక్క సర్వీసు ఉండటంతో విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పయనమయ్యే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు’ అని ఎయిరిండియా తెలిపింది.