Good news for the residents of Hyderabad.. Full services will start from today
mictv telugu

హైదరాబాద్ వాసులకు శుభవార్త..నేటి నుంచి పూర్తి సేవలు షురూ

July 18, 2022

హైదరాబాద్‌ వాసులకు ఎంఎంటీఎస్ అధికారులు సోమవారం ఓ శుభవార్తను చెప్పారు.తెలంగాణలో గతవారం భారీ వర్షాలు కురిసిన కారణంగా స్టేషన్లకే పరిమితమైన ఎంఎంటీఎస్ రైళ్లు నేటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మొత్తం 75 ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు, 16 మెమూ పాసింజర్లు కూడా ఈరోజు నుంచి యథాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు.

“గతవారం వర్షాల కారణంతో 8 రోజులు షెడ్డుకు పరిమితమైన రైళ్లు మళ్లీ సోమవారం నుంచి పట్టాలు ఎక్కయి. ఈరోజు నుంచి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమవుతుండటంతో అదేస్థాయిలో ఎంఎంటీఎస్ రైళ్లు, నగర శివారు పరిసరాలను కలుపుతూ, నడిచే పాసింజర్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. ఎంఎంటీఎస్‌లో ప్రయాణించే ప్రయాణికులు, సామాన్య ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోని, ఎంఎంటీఎస్ సేవలను సద్వినియోగం చేసుకొండి” అని అధికారులు కోరారు.