సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ప్రొబేషన్‌ డిక్లర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ప్రొబేషన్‌ డిక్లర్‌

May 12, 2022

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హత గల ఉద్యోగులకు జూన్‌ నెలలో ప్రొబేషన్‌ డిక్లర్‌ చేస్తూ, నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు.

వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ”సర్వే శాఖలో ప్రమోషన్లు కల్పిపించేలా రీ–ఆర్గనైజ్‌ చేసి 410 పోస్టులకు అప్‌గ్రేడ్‌ ప్రమోషన్‌ అవకాశాలు కల్పించిన జగన్‌కు ముందుగా కృతజ్ఞతలు. సర్వే డిపార్ట్‌మెంట్‌లో 410 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా ఆయన చర్యలు తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారమైంది. బుధవారం అసోసియేషన్‌ ప్రతినిధుల బృందంతో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యాం. పలు సమస్యలను జగన్‌కు వివరించాం, దానికి ఆయన వెంటనే ప్రొబేషన్‌ డిక్లర్‌ చేస్తూ, నిర్ణయం తీసుకున్నారు.”అని ఆయన అన్నారు.