Good news for the unemployed..5,043 jobs advertisement released
mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త..5,043 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

September 5, 2022

దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఉద్యోగమే లక్ష్యంగా, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్తను చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 5,043 నాన్ ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశామని, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి, తాజాగా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. ”మొత్తం 5048 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఉన్నాయి. అందులో జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్), జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, అసిస్టెంట్ గ్రేడ్ -3 (జనరల్) , అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్) , అసిస్టెంట్ గ్రేడ్-3 (టెక్నికల్), అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో) , అసిస్టెంట్ గ్రేడ్-3 (హిందీ) పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అర్హతలు..పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్/ బోటనీ/ జువాలజీ/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ! మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో-టెక్నాలజీ/ సివిల్), డిప్లొమా (సివిల్/ మెకానికల్)/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. దరఖాస్తు రుసుం రూ. 500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు). పూర్తి వివరాలకు అభ్యర్థులు..https://recruitmentfci.in/ను సందర్శించండి. ఈ ఉద్యోగాలకు 06.09.2022 నుంచి 05.10.2022వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు”.