నిరుద్యోగులకు శుభవార్త.. ఆప్లై చేసుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త.. ఆప్లై చేసుకోండి

March 3, 2022

భారత ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తెలంగాణలోని మహబూబాబాద్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఎలా, ఖాళీలు ఎన్ని, జీతభత్యాలు ఎంత, ఎంపిక విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందామా..

పోస్టులు: టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌

1. ప్రైమరీ టీచర్‌ (PRT)

అర్హతలు: ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌/బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే, సీటెట్‌ అర్హత కలిగి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో టీచింగ్‌ ప్రొఫీషియన్సి, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21250.

2. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (TGT)

విభాగాలు: ఇంగ్లీష్‌, హిందీ, సంస్కృతం, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌, మ్యాథ్య్‌

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాడే సీటెట్‌ అర్హత కలిగి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో టీచింగ్‌ ప్రొఫీషియన్సి, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.26250లు జీతంగా చెల్లిస్తారు.

3. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌తోపాటు పీజీ డిప్లొమా (కంప్యూటర్స్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో టీచింగ్‌ ప్రొఫీషియన్సి, సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.26250లు జీతంగా చెల్లిస్తారు.

4. ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్‌

అర్హతలు: సైకాలజీలో ఎంఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.26250లు జీతంగా చెల్లిస్తారు.

5. గేమ్స్, స్పోర్ట్స్‌ కోచ్‌/యోగా టీచర్లు

అర్హతలు: సాయ్‌ కోచ్‌/ఎన్‌ఐఎస్/ఎంపీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21250లు జీతంగా చెల్లిస్తారు.

6. నర్సింగ్‌ సిస్టర్‌

అర్హతలు: బీఎస్సీ నర్సింగ్‌/డిప్లొమా (జీఎన్‌ఎమ్‌ నర్సింగ్‌) లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్‌: రోజుకు రూ.750లు జీతంగా చెల్లిస్తారు.

7. డేటా ఎంట్రీ ఆపరేటర్లు

అర్హతలు: ఇంటర్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000లు జీతంగా చెల్లిస్తారు.

8. పీఆర్టీ మ్యూజిక్‌

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌, మ్యూజిక్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21,250లు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 4, 2022.

mahabubabad.kvs.ac.in