నిరుద్యోగులకు టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ సెంటర్ ఆధ్వార్యంలో ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్‌లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 18-30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్ సదుపాయన్ని కల్పిస్తున్నారు
పదోతరగతి అర్హత
ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ కోసం ఉచితంగా శిక్షణ అందిస్తారు. దీనికి కేవలం పదోతరగతి అర్హత ఉంటే సరిపోతుంది. 4 నెలలపాటు దీనిపై శిక్షణ ఉంటుంది. ఎంస్ ఆఫీస్, ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ, ఇంటర్నెట్ కాన్సెప్ట్‌లు, రెజ్యూమ్ ప్రిపరేషన్, టైపింగ్ ప్రాక్టీస్ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు.
ఇలా సంప్రదించండి
శిక్షణ తీసుకోవాలనుకునే అభ్యర్థులు కాచిగూడలోని సీసీ ష్రాఫ్ హాస్పిటల్ ఎదురుగా ఠాకూర్ నివాస్‌లో ఉన్న టెక్ మహీంద్రా స్మార్ట్ సెంటర్‌ను సంప్రదించాలి. అలాగే 9030022505 లేదా 7989995685 నంబర్‌లకు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఈ కోర్సు కోసం ఎవరికీ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితం.