తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 17 వేల ఉద్యోగాలు భర్తీ? - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 17 వేల ఉద్యోగాలు భర్తీ?

February 18, 2022

 news02

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల‌కు శుభవార్తను అందించనుంది. అతి త్వరలోనే భారీ ఉద్యోగ ప్రకటన చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల చివ‌రి వారంలో ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు విడుద‌ల చేయ‌నున్నట్టు స‌మాచారం. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులు, పోస్టింగ్‌లు పూర్తి కావడంతో, త్వరలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించి కేసీఆర్ ఈ వారంలో నిర్ణయం తీసుకొని, ఈ నెలాఖరులోగా తొలి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం 70 వేల వరకు పోస్టులు భర్తీ చేయాలని భావిస్తోంది. వీటిలో పోలీసు ఉద్యోగాలు 17 వేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు టీఎస్‌పీఎస్ నుంచి గ్రూప్-2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మరోపక్క ఇప్పటికే నిరుద్యోగులు దిల్‌సుఖ్ నగర్, అమీర్‌పేట్, అశోక్ నగర్ వంటి ప్రాంతాలలోని పలు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నారు. మరికొందరు ఫ్రిపరేషన్ చేస్తూ, ఉద్యోగాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.