తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 80,039 ఉద్యోగాల‌కు ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 80,039 ఉద్యోగాల‌కు ప్రకటన

March 9, 2022

fbfbfdb

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,099 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,108 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని చెప్పారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం చెప్పారు.

గరిష్ఠ వయో పరిమితి పెంపు..

ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పెంచుతున్నట్లు కేసీఆర్ సభలో ప్రకటించారు. పదేళ్లపాటు పెంచినట్లు తెలిపారు. ఓసీ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. దివ్యాంగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 54 ఏళ్లకు పెంచినట్లు వివరించారు.

ఖాళీల వివరాలివీ..

సీఎం కేసీఆర్ ప్రకటన ప్రకారం శాఖల వారీగా ఖాళీవ వివరాలను పరిశీలిస్తే.. హోంశాఖలో 18,844 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 18,086, వైద్యారోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులను భర్తీ చేయనున్నారు.