ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుపతిలోని ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఒప్పంద, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలిపింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జీతభత్యాలు ఎంత, ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనే సమాచారం మీకోసం..
మొత్తం ఖాళీల సంఖ్య: 28
పోస్టుల వివరాలు:
1. ఫిజిసిస్ట్/న్యూక్లియర్ ఫిజిసిస్ట్
2. రేడియోలాజికల్ ఫిజిసిస్ట్.
3. ల్యాబ్ టెక్నాషియన్.
4.ఫార్మసిస్ట్.
5. డెంటల్ టెక్నీషియన్.
6. స్పీచ్ థెరపిస్ట్.
7. డయాలసిసి టెక్నీషియన్.
8. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ తదితర పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.12,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పది, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే, వ్యాలిడ్ గేట్ స్కోర్, సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: SVRR Government General Hospital, Tirupati, Chittoor district
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.
https://chittoor.ap.gov.in/