లింగంపల్లి నుంచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్.. - MicTv.in - Telugu News
mictv telugu

లింగంపల్లి నుంచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్..

April 16, 2019

శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల రైలు ప్రయాణికులకు శుభవార్త. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఏప్రిల్ 15వ తేదీ సోమవారం నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. వైజాగ్ వరకు వెళ్లే ఈ రైలు ఇన్నాళ్లూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభమయ్యేది. లింగంపల్లి నియోజకవర్గం వర్గం పరిధిలోని ప్రయాణీకులు సికింద్రాబాద్ వెళ్లేసరికి రైలు వెళ్లిపోతుండేది. దీంతో కొందరు ప్రయాణికులు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి నుంచే నడపాలని ఉన్నతాధికారులను కోరారు.

Good news for train passengers surrounding areas of Serilingampally.. Janmabhoomi Express was launched.

దానికి రైల్వే శాఖ ఓకే చెప్పడంతో ప్రయణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక లింగంపల్లి నుంచి ట్రాఫిక్‌లో సికింద్రాబాద్ వరకు వెళ్లనవసరం లేదని, సమయానికి ప్రయాణం చేయొచ్చని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు ప్రతిరోజు లింగంపల్లిలో ఉదయం 6.15గంటలకు ప్రారంభమై రాత్రి 7.30గంటలకు వైజాగ్‌ చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం వైజాగ్‌లో 6.15గంటలకు మొదలై రాత్రి 7:40గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. కాగా లింగంపల్లి నుంచి ఉదయం ప్రారంభమైన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు బేగంపేటలోనూ హాల్ట్ ఇచ్చారు.