ప్రయాణికులకు శుభవార్త.. త‌క్కువ ధ‌ర‌కే ట్రైన్ టికెట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికులకు శుభవార్త.. త‌క్కువ ధ‌ర‌కే ట్రైన్ టికెట్లు

February 23, 2022

train

ఐఆర్‌సీటీసీ రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త తెలిపింది. కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్ సహాయంతో తక్కువ ధర టిక్కెట్‌లను అందిస్తున్న‌ట్లు ప్రకటించింది. త‌ర‌చూ దూర ప్రాంతాల‌కు రైల్లో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు ఇక నుంచి త‌క్కువ ధ‌ర‌కే టికెట్‌ల‌ను అందించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్‌) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) సంయుక్తంగా బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకోచ్చింది.

“వినియోగ‌దారులు ఈ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి, ఏదైనా ఏసీ క్లాస్ రైల్వే టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే త‌క్కువ ధ‌ర‌కే ట్రైన్ టికెట్‌ల‌ను పొంద‌వ‌చ్చు. అంతేకాదు ఈ కార్డ్‌తో కిరాణా స్టోర్ నుంచి పెట్రోల్ బంకుల‌తో పాటు, ఇత‌ర షాపింగ్ ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. జేసీబీ నెట్‌వర్క్ సాయంతో అంత‌ర్జాతీయ వ్యాపార కార్యాల‌పాలు నిర్వ‌హించే వారు ఏటీఎం ట్రాన్సాక్ష‌న్‌లు నిర్వ‌హించేందుకు ఈ కార్డ్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు” అని తెలిపింది.

ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ ర‌జ‌ని హసిజాతో మాట్లాడుతూ..’ఐఆర్‌సీటీసీ బాబ్ రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్కార్డ్ హోల్డర్లు 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ,సీసీ,ఎగ్జిక్యూటివ్‌పై గరిష్టంగా 40 రివార్డ్ పాయింట్‌లను పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన క్లాస్ బుకింగ్‌లు చేసే కార్డ్ కస్టమర్లు ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లపై ఒక శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. కార్డ్ జారీ చేసిన 45 రోజులలోపు రూ.1000లేదా అంతకంటే ఎక్కువ విలువైన బోనస్ రివార్డ్ పాయింట్లు పొంద‌వ‌చ్చ‌ని’ అని ర‌జ‌నీ తెలిపారు.