Good news for travelers coming to India..
mictv telugu

భారత్‌కు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్..

November 22, 2022

విమానంలో మాస్క్ తప్పనిసరిని ఎత్తివేసిన భారత్ తాజాగా మరో నిబంధనను ఎత్తివేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని తప్పనిసరిగా నింపాలన్న ‘ఎయిర్ సువిధ’ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ వ్యాక్సిన్‌, ఎన్ని డోసులు , ఎప్పుడెప్పుడు వేయించుకున్నారన్న దానిని కూడా డిక్లరేషన్‌ ఫారమ్‌లో కచ్చితంగా నింపాలి. అంతేకాకుండా ఆర్టీపీసీఆర్‌ టెస్టు వివరాలను అందులో పొందుపరచాలి. తాజాగా ఈ నిబంధనను భారత్‌ ఎత్తివేసింది.

Air Suvidha form, a pain for passengers flying to India, removed

కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం,ప్రపంచవ్యాప్తంగా,భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజీలో గణనీయమైన పురోగతిని సాధించిన దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరించిన అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నవంబర్ 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి(మంగళవారం అర్దరాత్రి) అమల్లోకి రానుంది.