ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి 12.30 వరకు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి 12.30 వరకు

April 14, 2022

20

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నివాసం ఉంటూ, ఉద్యోగాల రీత్యా లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేసి ప్రయాణికులకు ఎంఎంటీఎస్ శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా చాలా రోజులపాటు నిలిచిపోయిన ఎంఎంటీఎస్ సేవలను మళ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరికొన్ని రూట్లలో రైళ్లను పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 11 నుంచి జంట నగరాల మధ్య మరో 86 ఎంఎంటీస్ రైళ్లను నడపబోతున్నారు. గతంలో ఉదయం 6 నుంచి రాత్రి 11.45 వరకు మాత్రమే ఎంఎంటీఎస్ రైళ్లు నడిచేవి. తాజాగా ఈ టైమింగ్స్‌ను పొడిగించారు. ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30 రైళ్ల రాకపోకలు సాగించనున్నట్టు సికింద్రాబాద్ రైల్యే స్టేషన్ అధికారులు తెలిపారు. దీంతోపాటు ప్రయాణికుల సౌలభ్యం కోసం సీజనల్ టిక్కెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.

 

 

1. 47206 నంబర్ గల రైలు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి 5.50కు హైదరాబాద్ చేరుకుంటుంది.
2. 47150 నంబర్ గల రైలు ఉదయం 6.45కు సికింద్రాబాద్ నుంచి 1.43కు లింగంపల్లి చేరుకుంటుంది.
3. 47195 నంబర్ గల రైలు 22.20కు బయలుదేరి, 23.10కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
4. 47193 నంబర్ గల రైలు 23.25కు లింగంపల్లి నుంచి బయలు దేరి 00.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
5.47201 నంబర్ గల రైలు 16.35కు ఫలక్‌నామా నుంచి 17.50కు హైదరాబాద్ చేరుకుంటుంది.
6.47218 నంబర్ గల రైలు 21.05కు ఫలక్‌నామా నుంచి 23.05కు రామచంద్రాపురం చేరుకుంటుంది.
7.47177 నంబర్ గల రైలు 9.10గంటలకు రామచంద్రాపురం నుంచి 11.05కు ఫలక్‌నామా చేరుకుంటుందని అధికారులు తెలిపారు.