ప్రయాణికులకు శుభవార్త.. రేపటి నుంచే షురూ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికులకు శుభవార్త.. రేపటి నుంచే షురూ

March 26, 2022

ppp

విమానంలో ప్రయాణం చేసే ప్రయాణికులకు అంతర్జాతీయ విమాన సర్వీసులు శుభవార్తను తెలిపాయి. కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడడంతో రేపటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను శనివారం కేంద్రం విడుదల చేసింది. మరి ఆ మార్గదర్శకాలు ఏవో తెలుసుకుందామా..

కొత్త మార్గదర్శకాలు ఇవే..

1. సిబ్బందికి పూర్తి స్థాయి పీపీఈ కిట్ అవసరం లేదు.
2. విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నిర్వహించే పాట్ డౌన్ సోదాలు మళ్లీ ప్రారంభం.
3. అంతర్జాతీయ విమానాలలో 3 సీట్లను ఖాళీగా ఉంచడంపై పరిమితి ఎత్తివేత.
4. విమానాశ్రయం లేదా విమానంలో మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి అంటూ తెలిపింది.

మరోపక్క కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానయాన సంస్థల నిర్వహణను భారత ప్రభుత్వం నిలిపివేసింది. వ్యాక్సినేషన్ వల్ల కరోనా మహమ్మారి కట్డడిలోకి వచ్చింది. దీంతో, మళ్లీ సర్వీసులను భారత ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్నట్లు పేర్కొంది.