తిరుమల తిరుపతి దేవస్థానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం త్వరగా జరిగేలా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అధికారులు సమావేశమైయ్యారు. దాదాపు 13 అంశాలపై చర్చలు జరిపారు.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ”ఇకనుంచి సామాన్య భక్తులకి త్వరగా దర్శనం కల్పించడానికి, సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తాం. నడకదారి భక్తులకి దివ్యదర్శనం టికెట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలం కేటాయించింది. ఆదిత్య తాక్రే నేడు ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను టీటీడీకి అందించారు. త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతాం. ఆలయ నిర్మాణానికి పూర్తి ఆర్థికంగా ఇవ్వడానికి గౌతమ్ సింఘానియా ముందుకొచ్చారు” అని ఆయన అన్నారు.