టీటీడీ భక్తులకు శుభవార్త.. ఈనెల 20 నుంచి ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ భక్తులకు శుభవార్త.. ఈనెల 20 నుంచి ప్రారంభం

March 17, 2022

tdp

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను త్వరలోనే విడుదల చేస్తున్నామని పేర్కొంది. అంతేకాకుండా ఈ సేవా టికెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి భక్తులకు అందుబాటులో ఉంచనున్నామని తెలిపింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించడం జరుగుతుందని వెల్లడించింది. ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు రెండు రోజుల పాటు కేటాయిస్తామని సూచించింది.

మరోపక్క కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.కావున స్వామివారి ఆర్జిత సేవలను కోరుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.